Site icon Bhakthi TV

పంచ కేదార్‌లలో ఒకటైన రుద్రనాథ్ ఆలయం ఎక్కడుందంటే..

పంచ కేదార్ ఆలయాల్లో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రమైన రుద్రనాథ్ ఆలయం గురించి తెలుసా? ఇది ఉత్తరాఖండ్ కొండలలో ఉంది. శివ భక్తులకు కేదార్‌నాథ్ ధామ్ ప్రధాన విశ్వాస కేంద్రంగా ఉన్నట్టే.. రుద్రనాథ్ ఆలయం కూడా అంతే విశ్వాసాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం ఉత్తరాఖండ్ కొండలలో ఉంది. ఈ ఆలయ విశేషం ఏంటంటే.. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు ఈ ప్రదేశానికి వచ్చి తమ సొంత సోదరులైన కౌరవులను చంపిన పాపం నుంచి విముక్తి పొందారట. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయ సందర్శనకు రోజుకు 140 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.

సుముద్ర మట్టానికి దాదాపు 3,600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. ఇదొక సహజ రాతి ఆలయం కావడం మరో విశేషం. ఈ ఆలయంలో రోడోడెండ్రాన్ మరుగుజ్జులు, ఆల్పైన్ పచ్చిక బయళ్ల దట్టమైన అడవిలో ఉన్న ఈ ఆలయం పంచ కేదార్లలో నాల్గవ కేదార్‌గా పరిగణించబడుతోంది. ఈ ఆలయానికి పాండవులతో అనుబంధముందని పురాణాలు చెబుతున్నాయి. అసలు పాండవులే మహాభారత కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. తమ సోదరులైన కౌరవులను చంపిన పాపం నుంచి విముక్తి పొందేందుకే పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారట.

Share this post with your friends
Exit mobile version