Site icon Bhakthi TV

తొలి ఏకాదశి ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి?

హిందూ ధర్మంలో తొలి ఏకాదశి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కొక్క ఏకాదశిని ఒక్కో పేరుతో పిలుస్తారు. ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని తెలుగు ప్రజలు పిలవగా ఇతర ప్రాంతాల వారు దేవశయన ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి రోజుల విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడట. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. ఏకాదశి నుంచి హిందువుల పండుగలన్నీ ప్రారంభమవుతాయి. ఇంతకీ ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందంటారా? తిథి ప్రారంభమవడం మాత్రం ఇవాళే ప్రారంభమవుతుంది. కానీ రాత్రి 8 గంటల తర్వాత ప్రారంభమవుతుంది కాబట్టి రేపు ఏకాదశి జరుపుకుంటాం.

హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ శుక్ల పక్ష ఏకాదశి తేదీ 16 జూలై 2024 రాత్రి 8:33 గంటలకు ప్రారంభమై జూలై 17వ తేదీ రాత్రి 9:02 గంటలకు ముగుస్తుంది. కనుక తొలి ఏకాదశి ఉపవాసం జూలై 17, 2024 బుధవారం రోజున చేయాల్సి ఉంటుంది. ఇక ఉపవాసం విరమించేది ఎప్పుడంటే ద్వాదశి తిథి సూర్యోదయం తర్వాత మాత్రమే విరమించాలి. ద్వాదశి తిథి ముగిసేలోపు ఏకాదశి వ్రతాన్ని విరమించాల్సి ఉంటుంది. అంటే జూలై 18న ఉదయం 5:35 నుంచి 8:20 మధ్య ఉపవాసాన్ని ముగించాల్సి ఉంటుంది. ద్వాదశి తిథి 18వ తేదీన 8.44 గంటలకు ముగుస్తుంది.

Share this post with your friends
Exit mobile version