Site icon Bhakthi TV

సోమవతి అమావాస్య ఎప్పుడు? ఆ రోజున ఏం చేయాలి?

హిందూమతంలో పౌర్ణమికే కాదు.. అమావాస్యకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. అమావాస్య విషయంలోనూ సోమవతి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. సోమవారం అమావాస్య తిథి వస్తే దానిని సోమవతి అమావాస్య అంటారు. ఈ రోజు శివపార్వతులను కొలుస్తారు. సోమవతి అమావాస్యనాడు శివపార్వతులను పూజిస్తే మనం కోరిన కోరికలన్నీ నెరవేరడంతో పాటు జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయని నమ్మకం. కాబట్టి ఈ రోజుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మరి సోమవతి అమావాస్య ఎప్పుడు రానుంది? ఆ రోజున చేయాల్సిన పరిహారాలేంటో తెలుసుకుందాం.

పంచాంగం ప్రకారం మార్గశిర మాసం కృష్ణ పక్షంలోని అమావాస్య తిథి డిసెంబర్ 30న ఉదయం 4:01 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు డిసెంబర్ 31 తెల్లవారుజామున 3:56 గంటలకు ముగుస్తుంది.ఉదయతిథి ప్రకారం సోమవతి అమావాస్య డిసెంబర్ 30 న మాత్రమే జరుపుకోవాలి. అయితే ఈ రోజున చేసే కొన్ని పరిహారాలు మనకు చాలా మంచి చేస్తాయట. అవేంటో తెలుసుకుందాం. సోమవతి అమావాస్య రోజున శివలింగానికి నీరు,పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తే చాలా మంచిదని చెబుతారు. సోమవతి అమావాస్య నాడు ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

Share this post with your friends
Exit mobile version