Site icon Bhakthi TV

ఏకాదశి రోజున చేయాల్సినవేంటి? చేయకూడనివేంటి?

దేవశయన ఏకాదశి ఎప్పుడు వస్తుంది? ఏంటనే విషయాలను తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు ఏకాదశి రోజున ఎవరిని పూజించాలి? ఎలా వ్రతం ఆచరించుకోవాలో తెలుసుకుందాం. ఈ ఏడాది జూలై 17న తొలి ఏకాదశి వ్రతాన్ని మనం జరుపుకుంటాం. ఈ రోజున లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తిని పూజించుకుంటాం. ఇలా చేయడం వలన సుఖ సంతోషాలతో పాటు సిరిసంపదలు కూడా కలుగుతాయట. దేవశయని ఏకాదశి రోజున ఏమి చేయాలో తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తంలో లేచి శుచిగా స్నానం చేసి పసుపురంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవి, విష్ణు మూర్తిలను పూజించాలి. అయితే ఈ ఏకాదశి రోజున స్త్రీలు మాత్రం తల స్నానం చేయకూడదట.

ఈ రోజున దాన ధర్మాలకు కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అంతే కాదు ధనం, ధాన్యాలు, వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిదని అంటారు. అలాగే శ్రీ హరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలట. ఇవన్నీ చేస్తూ వ్రతం ఆచరిస్తే చాలా మంచిది. చేయకూడనివి ఏంటంటే.. దేవశయని ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు. ఈ రోజున అన్నం కూడా తినకూడదు. అసలు అన్నంతో తయారు చేసిన ఏ ఆహారాన్ని ముట్టకూడదు. స్త్రీలను, పెద్దలను అవమానించడం.. తులసి మొక్క ఆకులను తెంపడం కానీ చేయకూడదు. అలాగే గోళ్లు, వెంట్రుకలు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు. పసుపు రంగు దుస్తులు లేకుంటే ఎరుపు రంగు దుస్తులు ధరించాలి.

Share this post with your friends
Exit mobile version