Site icon Bhakthi TV

ఈ ముస్లిం దేశంలో ఏ ఏ హిందూ దేవుళ్ల ఆలయాలున్నాయంటే..

ముస్లిం దేశమైన ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో జరిగే రామ్ లీలా కార్యక్రమం గురించి తెలుసుకున్నాం కదా. అలాగే ఇక్కడి జావా ద్వీపంలోనూ ప్రంబనన్ హిందూ ఆలయ సముదాయం గురించి కూడా తెలుసుకుందాం. ఇది రామాయణ చిత్రణలకు ప్రఖ్యాతి గాంచిన ఆలయం. రామాయణంను తిలకించేందుకు స్థానికులు మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వాస్తవానికి రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. కానీ రామాయణంలో 300కు పైగా వెర్షన్లు ఉన్నాయి. ఇక్కడ జరిగే రామాయణ ప్రదర్శనను రామకీన్ అని పిలుస్తారు.

రామాయణం ఆధారంగా రూపొందించిన నృత్య నాటకమే రామకీన్. అయితే రామాయణంలోని పాత్రల పేర్లను మార్చి ఇక్కడి ఆలయ థియేటర్‌లో నిత్యం ప్రదర్శిస్తూ ఉంటారు. 1971లో రామాయణ బ్యాలెట్‌ను ప్రారంభించగా.. ఈ సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రపంచంలో అతి ఎక్కువ కాలం నడిచిన నృత్య నాటకంగా ఇక్కడ ప్రదర్శితమవుతున్న రామాయణం.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయబడింది. ఒక్క రాముల వారి ఆలయాలే కాకుండా ఇండోనేషియాలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఆలయాలు కూడా ఉన్నాయి.

Share this post with your friends
Exit mobile version