Site icon Bhakthi TV

అద్దాల మండపం, ధ్వజస్తంభ, వసంత మండపాల్లో ఏం చేస్తారంటే..

కృష్ణరాయ మండపానికి ఉత్తరం దిక్కున ఉన్నదే అద్దాల మండపం లేదా ఆఐనా మహల్ అంటారు. దీనిని 36 స్థంభాల‌తో అద్భుతంగా నిర్మిచారు. ఇందులో మందిరం, అంత‌రాళం, గ‌ర్భ‌గృహం ఉన్నాయి. ఇక్క‌డ ప్ర‌తి రోజు స్వామివారికి డోలోత్స‌వం నిర్వ‌హిస్తారు.

ధ్వజస్తంభ మండపం : డ‌వ గోపుర‌మైన వెండి వాకిలిని తాకుతూ ధ్వజస్తంభ మండపాన్ని క్రీ.శ 1470లో విజ‌య‌న‌గ‌ర చ‌క్ర‌వ‌ర్తి సాళువ న‌ర‌సింహ‌రాయులు నిర్మించారు. 10 రాతి స్థంభాల‌తో నిర్మిచిన మండ‌పంలో బంగారు ధ్వజస్తంభం, బలిపీఠం ఉంటాయి. ఈ స్థంభాల‌పై వివిద దేవ‌తామూర్తుల శిల్పాలు, ఇంకా సృష్ఠికి సంబంధించిన స్త్రీ, పురుషుల సంబంధాల‌ను తెలిపే అనేక శిల్పాలు పొందుప‌రిచారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవంలో తొలిరోజు ఈ ధ్వజస్తంభంపై గరుడకేతనం ఎగురవేస్తారు. దీన్నే ధ్వజారోహణం అంటారు. జస్తంభానికి తూర్పు దిక్కున అనుకొని ఉన్న ఎతైన పీఠమే బలిపీఠం. శ్రీవారి ఆలయంలో నివేదన అనంతరం అర్చకులు బలిని ఆయా దిక్కుల్లో ఉన్న దేవతలకు మంత్రపూర్వకంగా సమర్పిస్తారు.

వసంత మండపం : తిరుమల శ్రీవారి ఆలయానికి మహాప్రదక్షిణ మార్గంలో నైరుతిమూలలో వసంత మండపం ఉంది.

Share this post with your friends
Exit mobile version