Site icon Bhakthi TV

చిలుక ప్రాణాల కోసం ఇంద్రుడు.. బ్రహ్మ.. విష్ణుమూర్తి ఏం చేశారంటే..

ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది. ఆ వైద్యుడు ఇక చిలుక బతకడం కష్టమని చెప్పాడు. ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి.. “మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలుకను బతికించండి. లేదంటే నేనూ చనిపోతాను” అని కన్నీరుపెట్టుకుంది. దానికి ఇంద్రుడు.. “దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు రాసేది బ్రహ్మ కదా..! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను.నువ్వేం దిగులు పడకు..!” అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు.

ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ.. “నేను తలరాతలు మాత్రమే రాస్తాను. దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు.. కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం పద.” అంటూ బయలుదేరారు. వీరి రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు. “నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే.. కానీ.. చిలుక ప్రాణం చివరి దశలో ఉంది. మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం. మనం ముగ్గురం శివుని వద్దకు వెళదాం పదండి” అన్నారు. ముగ్గురూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు.” ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను.. మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి..! ” అంటూ అందరూ బయలుదేరారు. ఆ తరువాత ఏం జరిగిందో తదుపరి కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version