Site icon Bhakthi TV

దీపావళి నాడు లక్ష్మీపూజకు ఏ రాశి వారు ఏ రంగు దుస్తులు ధరించాలంటే..

దీపావళి భారతీయులు జరుపుకునే ప్రధాన పండుగల్లో ఒకటి. ఈ పండుగ నాడు అంతా లక్ష్మీ పూజ నిర్వహించుకుంటారు. అయితే లక్ష్మీపూజ సమయంలో మహిళలు కట్టుకునే చీరను బట్టి కూడా ఫలితం ఉంటుందట. ఏ రాశివారు ఏ చీర కట్టుకోవాలో తెలుసుకుందాం.

మేషరాశి: ఈ రాశికి చెందిన స్త్రీలు వారు లక్ష్మీ పూజ కోసం ఎరుపు రంగుకి సంబంధించిన దుస్తులను ధరించాలి.

వృషభరాశి: లక్ష్మీదేవి పూజ సమయంలో ఈ రాశి వారు నీలం రంగు దుస్తులను ధరించాలి. స్కై బ్లూ లేదా రాయల్ బ్లూ వంటి రంగు దుస్తులను కూడా ధరించవచ్చు.

మిధునరాశి: ఈ రాశి వారు దీపావళి నాడు లక్ష్మీపూజ కోసం నారింజ రంగును ధరిస్తే చాలా మంచిది.

కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు దీపావళి పూజ సమయంలో ఆకుపచ్చని బట్టలు ధరించాలి. క

సింహ రాశి: ఈ రాశికి చెందిన వారు బ్రౌన్ కలర్ దుస్తులు ధరించాలి.

కన్య రాశి: కన్య రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించాలి.

తులారాశి: ఈ రాశివారు లక్ష్మీ పూజకు పసుపు లేదా ఈ రంగుకు దగ్గరగా ఉండే దుస్తులను ధరించాలి.

వృశ్చికరాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు లక్ష్మీ పూజకు మెరూన్ రంగు దుస్తులు ధరించాలి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు దీపావళి రోజున ఊదా రంగు దుస్తులు ధరించాలి.

మకరరాశి: ఈ రాశి వారు లక్ష్మీ పూజకు నీలం రంగు దుస్తులు ధరించాలి.

కుంభ రాశి: ఈ రాశి వారు దీపావళి రోజున గ్రే కలర్ దుస్తులు ధరించాలి.

మీనరాశి: ఈ రాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించాలి.

Share this post with your friends
Exit mobile version