
ధన్‌తేరస్ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షం త్రయోదశి రోజున జరుపుకోవడం ఆనవాయితీ. ధన త్రయోదశిని ఈ ఏడాది అక్టోబర్ 29న రానుంది. ఈ పండుగ నాడు మనం ధన్వంతరి, లక్ష్మీ దేవితో పాటు, సంపదకు దేవుడు అయిన కుబేరుడిని పూజించుకుంటాం. ధన్వంతరిని పూజిస్తే ఆరోగ్యంగా జీవిస్తామట. లక్ష్మీదేవి, కుబేరుడిని పూజిస్తే సిరిసంపదలకు లోటు ఉండదని చెబుతారు. ధన త్రయోదశి నాడు బంగారం, వెండి కొనుగోలు చేస్తే మన ఇంట సంపద పెరుగుతుందని నమ్మకం. అయితే బంగారం, వెండి కొనే స్తోమత అందరికీ ఉండదు. అలాంటప్పుడు ఏమేం కొనొచ్చో తెలుసుకుందాం.
ధన్‌తేరస్ రోజున బియ్యం కొంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతామట. అలాగే ధనతేరాస్ నాడు శ్రీయంత్రాన్ని ఇంటికి తీసుకొస్తే చాలా మంచిదట. ఈ శ్రీయంత్రాన్ని కొని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయట. ఆ రోజున ధనియాలు కొని లక్ష్మీదేవికి సమర్పిస్తే సుఖసంతోషాలతో జీవిస్తామట. అలాగే చీపురు లక్ష్మీదేవికి చిహ్నం కాబట్టి ధన్‌తేరాస్ నాడు చీపురు కొంటే పేదరికం తొలగిపోతుందట. గోమతి చక్రాన్ని కొనుగోలు చేస్తే సంపద పెరుగుతుందట. గోమతి చక్రాన్ని నాగ చక్రం లేదా శిలా చక్రం అని కూడా అంటారు. దీనిని ఇంటికి తీసుకొస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందట.
