
రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలోని దేశ్నోక్‌లోని కర్ణి మాత ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. ఎలుకలను కర్ణి మాత వారసులని ఎందుకు అంటామో కూడా తెలుసుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణి మాత ఆలయ ఇటీవల సందర్శించారు. దీంతో ఈ ఆలయం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. మోదీ పర్యటనతో ఈ ఆలయ విశేషాలు తెలుసునేందుకు హిందువులంతా ఆసక్తి కనబరుస్తున్నారు. వాస్తవానికి రాజస్థాన్‌కు ప్రపంచం నలుమూలల నుంచి సందర్శకులు వస్తుంటారు. వారంతా ఇప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించేందుకు కూడా వస్తున్నారు.
ఈ ఆలయం చూపరులను కట్టిపడేస్తుంది. ఈ ఆలయ నిర్మాణం రాజస్థానీ శైలిలో జరిగింది. దీనిలో అందమైన చెక్కడాలు, పాలరాయి పని తీరు, ఆలయ ప్రధాన ద్వారాలు వెండితో తయారు చేయబడి అద్భుతంగా ఉంటాయి. ప్రధాన ద్వారాలపై దేవతలు, దేవుళ్ళకు సంబంధించిన పౌరాణిక కథల అందమైన చెక్కడాలున్నాయి. ఈ ఆలయంలో నిత్యం హారతి, భజనలు పలు సార్లు ఉంటాయి. హారతి కార్యక్రమంతో పాటు భజనలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాకుండా రాజస్థాన్‌కి చెందిన గొప్ప వారసత్వ సంపదగా పరిగణిస్తున్నారు.
