Site icon Bhakthi TV

8న వరలక్ష్మీ వ్రతం.. కావల్సిన సామగ్రి ఏంటంటే…

శ్రావణమాసంలో ముత్తైదువులంతా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం హిందూ ఆచారం. ఈ ప్రకారంగా చూస్తే ఈ నెల 8న వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకోవాల్సి ఉంది. దీనికోసం ఇప్పటికే మహిళలంతా సిద్ధమవుతున్నారు. అయితే కొత్తగా వ్రతం చేసుకునే వారికి కావల్సిన పూజ సామగ్రి, పూజా విధానం గురించి తెలియదు. కాబట్టి ముందుగా వాటి గురించి తెలుసుకుందాం.

వరలక్ష్మి వ్రతం కోసం.. పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ) సిద్ధం చేసుకోవాలి. ఆపై అమ్మవారి ప్రతిమ లేదంటే విగ్రహాన్ని సైతం ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఇక పంచామృతాలు తప్పనిసరి కాబట్టి వాటికోసం.. ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదారను సిద్ధం చచేసుకోవాలి. తొమ్మిది ముడులు వేసిన తోరమును సిద్ధం చేసుకోవాలి. దారానికి ఒకవైపు పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయాలి. మొత్తంగా తొమ్మిది తోరములు సిద్ధం చేసుకోవాలి.

Share this post with your friends
Exit mobile version