Site icon Bhakthi TV

ఇవాళ అపర ఏకాదశి.. ఎవరిని పూజిస్తారంటే..

హిందూ మతంలో ఏకాదశికి అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఏకాదశి విష్ణుమూర్తికి ఇష్టమైన రోజుగా చెబుతారు. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం నెలకు రెండు ఏకాదశులు.. ఏడాదికి 24 ఏకాదశులు ఉంటాయి. వైశాఖ మాసం బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి, అలాగే కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి. అన్ని ఏకాదశులలో అపర ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే అశ్వమేథ యాగం చేసిన ఫలితం వస్తుంది. వైశాఖ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అంటారు.

ఏకాదశి నాడు చేసే ఉపవాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ రోజున లక్స్మీనారాయణులను, తులసి మొక్కను సైతం పూజిస్తారు. అపర ఏకాదశి ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుందట. తులసి, గంధం, కర్పూరం, గంగా జలాలతో విష్ణుమూర్తిని పూజించాలని పండితులు చెబుతున్నారు. ఈ రోజున చేసే ఉపవాసం కారణంగా… కర్మ ఫలం వలన మరణానంతరం వచ్చే బాధలకు విముక్తి కలుగుతుందట. అలాగే జీవితంలో సంపద, శ్రేయస్సును కాపాడుకోవడం జరుగుతుంది. అపర ఏకాదశిని అచల ఏకాదశి అని కూడా అంటారు.

Share this post with your friends
Exit mobile version