Site icon Bhakthi TV

దక్షిణాదిలో వైభవంగా కేదార గౌరీ వ్రతం జరుపుకున్న భార్యాభర్తలు

పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులుగా భక్తులు కొలుస్తారు. అందుకే ఎరినైనా ఆశీర్వదించినా కూడా ఆది దంపతుల మాదిరిగా కలిసుండాలని దీవిస్తారు. శివపార్వతులది అన్యోన్య దాంపత్యం. అందుకే పార్వతీమాతకు శివుడు అర్థ శరీరం ఇచ్చేశాడు. వీరిని తలుస్తూ చేపట్టేదే కేదార గౌరీ వ్రతం. ఈ వ్రతాన్ని ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. దీపావళి రోజున ఈ కేదార గౌరీ వ్రతాన్ని భార్యాభర్తలిద్దరూ కలిసి చేసుకుంటారు. భర్తకు కుదరనప్పుడు భార్య.. ఆమెకు వీలుకానప్పుడు భర్త ఈ వ్రతాన్ని చేసుకుంటారు.

వివాహం కాని ఆడపిల్లలు కూడా ఈ నోము ఆచరించవచ్చు. అలాంటి కేదార గౌరీ వ్రతాన్ని ఇవాళ దక్షిణాదివాసులంతా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ మధ్యాహ్నం 3:52 నిమిషాల నుంచి అమావాస్య మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6:57 గంటల వరకు వరకూ ఉంది. సాధారణంగా పర్వదినాలు, వ్రతాలు అన్నీ మనం ఉదయ తిధితోనే జరుపుకుంటాం. కాబట్టి నవంబర్ 1వ తేదీనే కేదార గౌరీ వ్రతం జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచించారు. ఆ ప్రకారమే నేడు భార్యాభర్తలంతా కేదార గౌరీ వ్రతాన్ని ఆచరిస్తున్నారు.

Share this post with your friends
Exit mobile version