Site icon Bhakthi TV

ప్రశాంతంగా ముగిసిన అమరనాథ్ యాత్ర.. 5.1 లక్షల మందికి శివయ్య దర్శనం

పరమ శివుడు ప్రతి ఏటా శీతాకాలంలో సహజ సిద్ధంగా ఏర్పడి భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ప్రతి ఏటా అమర్‌నాథ్ యాత్ర కోసం భక్తులు పెద్ద ఎత్తున బయలుదేరుతుంటారు. ఈ యాత్ర అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్నది అయినా కూడా ప్రతి హిందువూ తన జీవితకాలంలో ఒకసారైనా అమర్‌నాథ్ యాత్ర చేయాలనుకుంటారు. సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో జమ్ము-కాశ్మీర్‌లోని హిమశిఖరాల మధ్య.. ఈ అమర్‌నాథ్ గుహ ఉంటుంది. ఏడాది మొత్తంలో కొన్ని రోజుల పాటు మాత్రమే మంచు శివలింగం రూపంలో శివయ్య దర్శనమిస్తూ ఉంటాడు. ఈ ఏడాది జూన్ 29న అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది.

ప్రతియేటా ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉండే ఈ అమర్ నాథ్ యాత్ర ప్రశాంతంగా ముగిసింది. గడిచిన 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర కొనసాగి శ్రావణ పూర్ణిమ రోజున పూర్తియింది. ఈ ఏడాది 5.1 లక్షల మంది యాత్రికులు మంచు శివలింగాన్ని దర్శనం చేసుకున్నారని ఆలయ అధికారులు చెబుతున్నారు. 2011, 2012లో వరుసగా 6.35 లక్షలు, 6.22 లక్షల మంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకోగా ఆ తరువాత రెండేళ్లు సగానికి భక్తుల సంఖ్య పడిపోయింది. తిరిగి ఈ ఏడాది కాస్త పుంజుకుంది. 2022లో 3.65 లక్షల మంది యాత్రికులు, 2023లో 4.45 లక్షల మంది యాత్రికులు దర్శించుకోగా ఈ ఏడాది 5 లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

Share this post with your friends
Exit mobile version