Site icon Bhakthi TV

శివపార్వతుల వివాహం అక్కడే జరిగిందట.. దానికి గుర్తుగా ఇప్పటికీ..

దేశంలో శివాలయాలకు కొదువేమీ లేదు. ఊరికొకటి ఉంటుంది. వీటిలో కొన్ని చాలా ప్రత్యేకమైనవి. ప్రతి ఆలయానికి ఏదో ఒక చరిత్ర ఉంటూనే ఉంటుంది. శివ పార్వతుల వివాహానికి సంబంధించిన ఆలయం కూడా ఒకటుంది తెలుసా? ఇక్కడే పార్వతీదేవిని శివుడు వివాహమాడాడట. అది ఎక్కడంటే ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని ఉఖిమత్ బ్లాక్‌లో ఉంది. ఈ శివాలయాన్ని త్రియుగినారాయణ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం కారణంగానే సముద్ర మట్టానికి 6495 అడుగుల ఎత్తులో కేదార్ లోయలో ఉన్న జిల్లాలోని ఉపాంత గ్రామ పంచాయతీకి త్రియుగినారాయణ అనే పేరు వచ్చింది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ ఆలయాన్ని త్రేతా యుగంలో నిర్మించారని ప్రతీతి. ఈ ఆలయంలో శివపార్వతుల వివాహానికి సాక్ష్యం కూడా ఉంది. అక్కడ జ్వలించే అఖండ ధుని అతి పెద్ద సాక్ష్యమని చెబుతుంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులూ ఉండవట. హిమవంత రాజు కుమార్తె అయిన పరా్వతీ దేవి పరమేశ్వరుడిని భర్తగా పొందాలనే కోరికతో కఠోర తపస్సు చేసింది. ఆ తరువాత శివ పార్వతుల వివాహం జరిగింది. బ్రహ్మదేవుడే పూజారిగా మారి శివపార్వతుల వివాహాన్ని ఈ ఆలయ ప్రాంతంలోనే జరిపించాడట. ఈ వివాహ సమయంలో శ్రీ మహా విష్ణువు పార్వతీదేవికి అన్నగా మారి అన్ని ఆచారాలను నిర్వహించాడట.

Share this post with your friends
Exit mobile version