Site icon Bhakthi TV

బ్రహ్మదేవుడికి దగ్గరుండి మరో పెళ్లి చేసిన శివుడు, విష్ణుమూర్తి

బ్రహ్మదేవుడు తలపెట్టిన యజ్ఞానికి దేవతలంతా వచ్చారు. ఆయన భార్య సావిత్రీదేవి మినహా. ఆమెకు తన స్నేహితులతో కలిసి రమ్మని నారదుడు చెప్పడంతో ఆగిపోయింది. ఒకవైపు సమయం మించిపోతోంది. దేవతలు, రుషులు అంతా సిద్ధంగా ఉన్నారు కానీ ధర్మపత్ని లేకుండా యజ్ఞం చేయకూడదు కాబట్టి ఏం చేయాలో పాలుపోక బ్రహ్మదేవుడు ఓ ఆలోచన చేశాడు. ఎలాగైనా తను అనుకున్న మూహూర్తానికే యజ్ఞం జరగాలన్న తలంపుతో ఓ అమ్మాయిని తక్షణమే వివాహం చేసుకోవాలనుకున్నాడు. వివాహం కోసం ఒక అమ్మాయిని చూడాలని ఇంద్రుడిని బ్రహ్మ పురమాయించాడు.

వెంటనే ఇంద్రుడు సమీపంలోని ఒక పాలమ్ముకునే అమ్మాయిని తీసుకొచ్చాడు. ఇక దీనిలో పాలు పంచుకున్న శివుడు, శ్రీమహావిష్ణువు సైతం తమ వంతుగా ఆమె శరీరాన్ని శుద్ధి చేసే మార్గం చెప్పారు.ఈ మేరకు ఆమె శరీరాన్ని గోవులోకి పంపించి శుద్ధి చేయడం ద్వారా ఆమె పునర్జన్మ ఎత్తినట్లవుతుందని శివుడు, మహావిష్ణువు తెలిపారు. వెంటనే గోవులోకి ఆమె శరీరాన్ని పంపి శుద్ది చేశారు. గోవుతో శుద్ధిచేయబడినది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణం చేశారు. ఆ తరువాత ఆమెకు అభ్యంగన స్నానం చేయించి సర్వాభరణశోభితురాలిని చేసి బ్రహ్మతో వివాహం జరిపించారు. వెంటనే నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభించారు. ఆ తరువాత ఏం జరిగిందో మరో కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends
Exit mobile version