2026 సంక్రాంతి నిజంగా అరుదైన ఆధ్యాత్మిక విశేషంతో రాబోతోంది. మకర సంక్రాంతి రోజునే శ్రీమహావిష్ణువుకు అంకితమైన షట్తిల ఏకాదశి కలయిక ఏర్పడటం 23 ఏళ్ల తర్వాత వస్తున్న మహాయోగంగా పండితులు చెబుతున్నారు. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. అదే సమయంలో ఏకాదశి తిథి ఉండటంతో.. చేసే స్నానం, పూజ, దానం అనేక రెట్లు పుణ్యఫలాన్ని ఇస్తాయని శాస్త్ర విశ్వాసం. ఈ రోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించి, “ఓం సూర్యాయ నమః” మంత్ర జపం చేయాలి. అనంతరం శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. నల్ల నువ్వులు, గోధుమలు, బెల్లం, దుప్పట్లు దానం చేయడం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం ఎంతో శుభప్రదం. ఈ పవిత్ర సంక్రాంతి జీవితంలో శాంతి, సమృద్ధి, సుఖసంతోషాలను ప్రసాదిస్తుందని నమ్మకం.

