Site icon Bhakthi TV

మకర సంక్రాంతి పండుగను ఏ తేదీన జరుపుకోవాలి?

మకర సంక్రాంతి పండుగను ఏ తేదీన జరుపుకోవాలనే సందేహం ప్రస్తుతం చాలా మందిలో ఉంది. దీని గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. రవి అనేటువంటి గ్రహం సంక్రమణ చెందేటువంటి రోజును బట్టి ఆ మాసాలకు ఆ సంక్రమణగా పేరు వచ్చింది. మకర సంక్రాంతి అంటే మకర రాశిలోకి రవి ప్రవేశించేటువంటి సంక్రమణ. ఈ విషయంలోనే కొందరికి సందేహం. మకర సంక్రాంతి 14వ తారీఖా.. లేదంటే 15వ తారీఖా అనే మీమాంస. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాలైన సిద్ధాంతాలు, గణితాలు ఉన్నాయి.

భారతదేశంలో మారుమూల గ్రామంలో కనీసం విద్యుత్ శక్తి కూడా లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రాచీన కాలంలో ఒక సిద్ధాంతి ఎప్పుడు పౌర్ణమిలు వస్తాయో ఎప్పుడు గ్రహణాలు కూడా ఏర్పడతాయో కూడా చెప్పేశారు. అంతటి మహనీయులు ఎంతో మంది ఈ సనాతన ధర్మాల్లో ఉన్నారు. మనకు సంబంధించినటువంటి సిద్ధాంతాల ప్రకారంగా చాంద్రమానం సౌరమానం ప్రత్యేకించి బృహస్పతిని ఆధారంగా చేసుకోవడం లేదా రవిని ఆధారంగా చేసుకోవడం ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియలు దుర్గోచర గణితం ఇవన్నీ కూడా ఉన్నాయి. వైదికమైనటువంటి భాషలో చెప్పాలంటే తప్పనిసరిగా శాస్త్రీయబద్ధంగా వైదికంగా 14వ తారీకునే మనం మకర సంక్రమణాన్ని జరుపుకోవాలి.

అయితే ఇప్పుడు అందరూ 15 అంటున్నారు. గురువుగారు సిద్ధాంత పరమైనటువంటి వ్యత్యాసాల వల్ల వచ్చినటువంటిది మీరు ప్రత్యేకించి గతించినటువంటి కొన్ని సంవత్సరాల ఈ సంక్రాంతి పర్వదినం ప్రత్యేకించి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ఆ రోజు నుంచే మొదలయ్యేటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉంటాం కానీ చాలా రకాలైనటువంటి సిద్ధాంతాలు మనం అనుకున్నట్టుగా సిద్ధాంతులు సిద్ధాంతాలు వాళ్లకు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్‌లో వచ్చినటువంటి డిఫరెన్స్ ఫలితంగా 15వ తారీకు ఏర్పడుతుందని అందరూ అనుకుంటున్నారు కృష్ణమాచార్యులు చెబుతున్నాడు. 14వ తారీకునే మకర సంక్రమణం జరగబోతుంది. కాబట్టి ఆ రోజునే సంక్రాంతి పర్వదినం జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. కాబట్టి 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ పండుగను జరుపుకోవాలని చెబుతున్నారు.

Share this post with your friends
Exit mobile version