Site icon Bhakthi TV

నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ

అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 22వ తేదీ వరకూ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు ఇవాళ అంకురార్పణ నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకూ కర్కాటక లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు జరుగుతాయి. రేపు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

జూలై 20వ తేదీ ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. దంపతులు ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. రూ.500/- చెల్లించిన వారికి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు. జూలై 23న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Share this post with your friends
Exit mobile version