Site icon Bhakthi TV

Maha Shivaratri 2025 New Song “Deva Deva Shankara”: మహా శివరాత్రి సందర్భంగా.. వనిత టీవీ స్పెషల్ సాంగ్

మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. మహా శివరాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది.

Maha Shivaratri 2025 New Song “Deva Deva Shankara” PROMO in Bhakthi TV

కాగా.. ఈనెల 26న భక్తులు శివరాత్రి పర్వదినాన్ని జరుపుకోనున్నారు. శివరాత్రి రోజు శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతాయి. హర హర మహాదేవ శంభో అంటూ .. శివలింగానికి అభిషేకం చేస్తుంటారు. శివరాత్రి రోజు జాగారం ఉన్న సమయంలో శివనామ సంకీర్తనతోనూ, జప ధ్యానాలతోనూ కాలక్షేపం చేస్తారు. ఇదంతా మహాశివరాత్రి పర్వదినానికి గల పౌరాణిక నేపథ్యం. ఈ నేపథ్యంలో భక్తి, వనిత, ఎన్టీవీ వారు ప్రత్యేక మహాశివరాత్రి స్పెషల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్నారు. ఈ పాటకు సంబంధించి ప్రోమో విడుదల కాగా.. ఫుల్ సాంగ్ త్వరలో రిలీజ్ కానుంది. ‘దేవ దేవ శంకరా దేవ శంభో శంకర దేవులాడినేడ దొరకవా’ అంటూ ప్రముఖ గాయకుడు గోరేటి వెంకన్న ఈ పాట పాడారు. ఈ పాటను సింగర్ రేవంత్ కూడా ఆలపించాడు. ఈ పాటకు లిరిక్స్ గోరేటి వెంకన్న అందించగా.. మ్యూజిక్ చరణ్ అర్జున్ ఇచ్చాడు. ఈ పాట మహాశివరాత్రి సందర్భంగా… త్వరలో వనితో టీవీలో ఎక్స్‌క్లూజివ్‌గా రిలీజ్ కానుంది.

Share this post with your friends
Exit mobile version