Site icon Bhakthi TV

అతిథులందరినీ కూర్చోబెట్టే బాధ్యతను శివుడే తీసుకున్నాడట..

శ్రీనివాసుని కల్యాణంలో ముందుగా నివేదన ఎవరికి చేశారో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు భోజనాల వడ్డన ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడి, నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోక భాగాన శ్రీశైలంలో మల్లిఖార్జునుడు బ్రమరాంబ సమేతంగా వెలసి ఉన్నారు. చక్కగా శివుడు అతిధులందరినీ కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు. పాండు తీర్ధం (గోగర్భం డ్యాము నుంచి దక్షిణగా కొద్ది రూరంలో ఉంది). నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళను (ఆకులను) వేశాక అందరికి ఒకేసారి వడ్డించారు. ముందు విస్తళ్ళపై నీరు చల్లి, తుడిచి, పాత్ర శుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, సంస్కారపూర్వకంగా ఉప్పు, శాస్త్రం ప్రకారం ఇతర పదార్ధాలు వడ్డించారు.

వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయ్యిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా, అందరిని ఉన్నంతలో ఏర్పాట్లు చేశాను. లోటు పాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి అని వేడుకున్నాడు. అందరి భోజనాలు ముగిశాక అందరికి దక్షిణ తాంబూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణ వచనం. అందరూ భోజనాలు చేసి కూర్చున్నారు. ఆ తరువాత శ్రీనివాసుడు అందరినీ భోజనమైందా అని పేరు పేరునా అడిగాడు. తరువాత శ్రీనివాసుడు, వకులమాత, మన్మథుడు, లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు.వీరి భోజనాలు మిగిసేసరికి సూర్యాస్తమయం అయిందని పురాణాలు చెబుతున్నాయి. అందరి భోజనాలు పూర్తయ్యాక, రాత్రికి అక్కడే గడిపేసి, తెల్లవారుజామునే మంగళ వాయిద్యాల నడుమ మగ పెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరిందట.

Share this post with your friends
Exit mobile version