Site icon Bhakthi TV

బతుకమ్మ సంప్రదాయం ఎలా మొదలైందంటే..

బతుకమ్మ తెలంగాణకు మాత్రమే ప్రత్యేక పండుగ. బొడ్డెమ్మతో మొదలయ్యే ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో సందడిగా గడిచిన అనంతరం బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం వంటివి పంచుకుంటూ ఉంటారు. గత కొన్ని శతాబ్దాలుగా తెలంగాణ ప్రజలు బతుకమ్మను తమ ఇంటి దేవతగా పూజిస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది.

ఇక తెలంగాణలో బతుకమ్మ సంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. నవాబులు, భూస్వాముల పెత్తందారీతనంలో నలిగిపోతున్న తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి. వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు తీవ్ర ఆవేదనకు గురయ్యేవారు. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. “బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో” పాటల వెనుక ఉండే మర్మం ఇదే.

Share this post with your friends
Exit mobile version