Site icon Bhakthi TV

సావిత్రీదేవి సరస్వతి నదిగా ఎలా మారిపోయిందంటే..

గాయత్రితో బ్రహ్మదేవుడికి వివాహం అయితే జరిగిపోయింది. ఆ వెంటనే నిర్ణీత సమయానికి యజ్ఞాన్ని సైతం ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన సావిత్రీదేవి బ్రహ్మదేవుడు మరో స్త్రీతో కలిసి యజ్ఞం చేస్తుండటాన్ని చూసి ఉగ్రరూపం దాల్చింది. అంతే బ్రహ్మదేవుడితో సహా అక్కడున్న వారందరినీ శపించింది. ఏ యవ్వనం చూసుకుని మరో వివాహం చేసుకున్నావో ఆ యవ్వనం కోల్పోయి వృద్ధుడిగా మారిపొమ్మని బ్రహ్మను శపిస్తుంది. అలాగే పుష్కర్ మినహా మరెక్కడా బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవని శపించింది.

ఇక అమ్మాయిని వెతుక్కుని వచ్చిన ఇంద్రునికి అన్ని యుద్ధాల్లోనూ ఓటమి తప్పదని శపిస్తుంది. ఇక శ్రీ మహావిష్ణువును మానవజన్మ ఎత్తి భార్యావియోగంతో బాధపడతావని.. శ్మశానంలో భూతప్రేతగణాలతో జీవించమని శివుడిని శపిస్తుంది. అలాగే బ్రహ్మకు, గాయత్రీదేవికి వివాహం జరిపించిన బ్రాహ్మణులు కటిక దారిద్ర్యంతో భిక్షాటన చేసుకోవాలని శపించింది. ఇక కుబేరుడి సంపదంతా దొంగలపాలై నిరుపేదగా మారమని శపించింది. ఆ తరువాత సావిత్రీ దేవి అక్కడి నుంచి వెళ్లిపోయింది. రత్నగిరి పర్వతాల్లో తపస్సు చేస్తూ అలాగే సరస్వతి నదిగా మారిపోయిందని పద్మపురాణం చెబుతోంది.

Share this post with your friends
Exit mobile version