Site icon Bhakthi TV

శ్రీవారి అన్న దానం ట్రస్ట్ కు ఒక కోటి రూపాయ‌లు విరాళం

బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన సుమధుర గ్రూప్‌ సీఎండీ శ్రీ మధుసూధన్‌ తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదం ట్ర‌స్టుకు ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు. ఈ మేర‌కు విరాళం డీడీని తిరుమలలోని గోకులం అతిథి భవనంలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈఓ శ్రీ సిహెచ్‌ వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ భరత్ కుమార్, శ్రీనవీన్‌కుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా.. ఈ నెల 14న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.

వీకెండ్స్.. అది కూడా ఆదివారం భక్తుల రద్దీ బీభత్సంగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఇవాళ కూడా కాస్త ఎక్కువగానే భక్తుల రద్దీ ఉంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాగా.. శనివారం శ్రీవారిని 75,140 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీమలయప్ప స్వామివారి హుండీ ఆదారం రూ.3.76 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 28,246 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Share this post with your friends
Exit mobile version