Site icon Bhakthi TV

ప్రపంచంలోనే అత్యుత్తమ గురుశిష్యుల గురించి తెలుసా?

తల్లిదండ్రుల తర్వాత స్థానం మనం గురువుకే ఇచ్చాం. గురువును బ్రహ్మ.. విష్ణుమూర్తి.. మహేశ్వరుడిగానూ భావిస్తూ ఉంటాం. అంతటి ఉన్నత స్థానంలో మనం గురువును పెట్టాం. మనమే కాదు.. పురాణకాలంలో భగవంతుడు కూడా గురువుకు ఉన్నత స్థానాన్ని ఇవ్వడం జరిగింది. గురువు అనుగ్రహంతో.. అపారమైన జ్ఞానాన్ని సంపాదించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, అర్జనుడు వంటి వారంతా గురువుకు ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఇక ఏకలవ్యుడు అయితే గురువు రూపాన్ని ప్రతిష్టించుకుని మరీ విలువిద్యలో ఆరితేరాడు. ఇక గురు పౌర్ణమి సందర్భంగా స్పూర్తిదాయకమైన గురు శిష్యుల గురించి తెలుసుకుందాం.

సాందీపని ఋషి-శ్రీ కృష్ణుడు: ప్రపంచానికి భగవద్గీతను భోదించిన శ్రీకృష్ణుడి కంటే పెద్ద గురువు ఎవరూ ఉండరు. కానీ ఆయనకూ ఓ గురువున్నాడు. ఆయనే సాందీపని ఋషి. కంస సంహారం అనంతరం శ్రీకృష్ణుడు తన సోదరుడు బలరాముడితో కలిసి ఉజ్జయినిలోని సాందీపని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ మహర్షి వద్ద 64 రోజులలో 64 కళలను జ్ఞాన నేర్చుకున్నాడు. సాందీపని మహర్షి – శ్రీకృష్ణుడు ప్రపంచానికే స్ఫూర్తిదాయం.

వశిష్ట ముని – శ్రీరాముడు: సోదరులైన రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులకు వశిష్ట మహర్షి విద్యను బోధించాడు. రాముడు అతని నుంచి వేదాలు సహా అనేక విద్యలను నేర్చుకున్నాడు. ఈ అద్భుతమైన గురు-శిష్య ద్వయం నేటి తరానికి స్పూర్తి దాయకం.

ద్రోణాచార్య – అర్జునుడు: పాండవులు, కౌరవులందరికీ ద్రోణాచార్యుడే గురువు. ఆయనే అందరికీ విలువిద్యను నేర్పించాడు. అర్జనుడులోని ఏకాగ్రత ఆయనను మరింత ఆకర్షించడంతో ప్రియ శిష్యుడిగా మారిపోయాడు. ప్రపంచంలోని అత్యుత్తమ గురు శిష్యుల్లో ద్రోణాచార్యుడు, అర్జనుడు ఉంటారు.

Share this post with your friends
Exit mobile version