Site icon Bhakthi TV

శివ పంచాక్షరీ మంత్రం గురించి తెలుసా?

పంచ భూతాల మాదిరిగా పంచ కృత్యాలు, పంచాక్షరీ మంత్రం కూడా ఉంది. సృష్టి, స్థితి, సంహర, తిరోభావ, అనుగ్రహాలు పంచకృత్యాలు అనబడతాయి. సృష్టి గురించి అందరికీ తెలుసు. సృష్టి అంతా క్రమశిక్షణతో సాగడమే స్థితి అని.. ప్రపంచ స్థూల రూపాన్ని సూక్ష్మంగా మార్చడమే సంహారం.. సూక్ష్మీకరించబడిన దాన్ని తిరిగి పునఃసృష్టి వరకు పరీక్షించడమే తిరోభావమట. ఇక పంచాక్షరీ మంత్రం గురించి తెలుసా? బ్రహ్మ, విష్ణువులకు స్వయంగా పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడట. అందుకే దానిని శివ పంచాక్షరీ మంత్రం అని అంటాం. ఇది చాలా శక్తివంతమైనదని అంటారు.

పంచభూతాల రుద్రస్వరూపము, పంచ అక్షరాల శివశక్తుల మహిమతో కూడుకున్నది కాబట్టి చాలా శక్తివంతమైనదని అంటారు. ఈ పంచాక్షరీ మంత్రాన్ని ప్రతి రోజూ స్మరిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయట. అలాగే మోక్షం కలుగుతుందని అంటారు. ఒకవేళ ప్రతిరోజూ ఈ మంత్రాన్ని పఠించడం సాధ్యపడని వారు.. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీకమాసంలో వీలైనన్ని సార్లు చెప్పుకుంటే చాలా మంచిదట. లేదంటే పంచాక్షరీ మంత్ర జపం చేయడం వల్ల జీవితంలో ఎంతో మంచి మార్పును చూడగలుగుతారు. భోళా శంకరుడి ముందు ధ్యానముద్రలో కూర్చొని వీలైనన్ని సార్లు పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తే మోక్షం తప్పక లభిస్తుందట.

Share this post with your friends
Exit mobile version