Site icon Bhakthi TV

ఈ రాఖీలను కడితే మాత్రం జాగ్రత్త అత్యవసరం..

రాఖీ పండుగ రోజున సోదరులకు కట్టే రాఖీలు ఇప్పుడు ఎన్నో వెరైటీస్ వస్తున్నాయి. పిల్లలకు అయితే ఒకరకంగా.. పెద్దలకైతే ఒకరకంగా రాఖీలు వస్తున్నాయి. స్తోమతను బట్టి ఈ రాఖీలు ఉన్నాయి. వెండి, బంగారు రాఖీలు కూడా వస్తున్నాయి. ఇక ఆధ్యాత్మికపరంగా అలోచించే వారికి ఆ కోవకు చెందిన రాఖీలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో రుద్రాక్షను ఉపయోగించి కూడా రాఖీలను తయారు చేస్తున్నారు. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయని నమ్మకం. మరి వేరే రాఖీల విషయంలో అంటే పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు కానీ రుద్రాక్ష రాఖీలను కట్టేటప్పుడు మాత్రం కొన్ని నియమాలున్నాయి. శివుడి కన్నీటి బిందువులే రుద్రాక్షలని నమ్ముతారు కాబట్టి అవి చాలా ప్రభావవంతమైనవి.

అందుకే వీటిని కట్టేటపుడు కొన్ని నియమాలను తప్పక పాటించాలి. రుద్రాక్షలు వివిధ ముఖాల్లోనూ లభిస్తాయి. సాధారణంగా అయితే పంచముఖ రుద్రాక్షలను ఎక్కువమంది ధరిస్తాయి. ఇవి ధరించేందుకు దేవుడి ఆశీర్వాదం తప్పనిసరి అని పండితులు చెబుతారు. వాస్తవానికి అయితే రాఖీ పేరుతో రుద్రాక్షలు కట్టడం మంచిది కాదని అంటున్నారు. రుద్రాక్షను మెడలో ధరిస్తే గుండె జబ్బులు వంటి వాటిని దరి చేరనీయదట. ఇక చేతికి కడితే నాడీ వ్యవస్థ పని తీరు బాగుంటుందట. ఇక రుద్రాక్షను రాఖీగా కట్టుకున్న నాటి నుంచి పరిశుభ్రతతో పాటు.. ఆహార, విహారాల విషయంలో నియంత్రణ ఉండాలట. ఇవన్నీ పాటించలేని వారు సాధారణ రాఖీలను ధరించడం మేలట. అయితే సోదరీమణులు ఏదైనా సంకల్పంతో కట్టదలిస్తే మాత్రం సోదరీమణులే బాధ్యత తీసుకుని కట్టాలట.

Share this post with your friends
Exit mobile version