
ఇవాళ్టి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తన తొమ్మిది రూపాల్లో కనిపించనున్నారు. ఈసారి శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులు కాదు మొత్తం10 రోజుల పాటు జరుపుకోనున్నారు. అయితే నవరాత్రులలో దుర్గాదేవిని ఆరాధించుకుంటే మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. దుర్గమ్మను మహాశక్తికి ప్రతీకగా భావిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి దుర్గమ్మను ఆరాధిస్తే జీవితంలో సానుకూలతతో పాటు బలం చేకూరుతుందని అమ్మవారి భక్తులు భావిస్తూ ఉంటారు.
అయితే ఆసక్తికరంగా ఈ సారి నవరాత్రుల రోజున అరుదైన యోగం కూడా రూపొందనుంది. అదే సర్వార్థ సిద్ధి యోగం. వాస్తవానికి సర్వార్ధసిద్ధి యోగాన్ని శుభ యోగంగా భావిస్తూ ఉంటారు. ఈ యోగంలో అమ్మవారిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ సందర్భంగా ఒకరోజు కాదు.. 4 రోజుల పాటు అంటే అక్టోబర్ 5 నుంచి 8 వరకూ యోగాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అరుదైన రవియోగం కూడా ఏర్పడనుంది. ఈ శుభ యోగంలో అమ్మవారిని పూజించడం వల్ల సమాజంలో వ్యక్తి గౌరవంతో పాటు వృత్తి పరంగా కూడా లాభాలు పొందుతారు.
