Site icon Bhakthi TV

దేవీ నవరాత్రుల్లో ఏ రోజున ఏ రంగు దుస్తులను ధరించాలి?

మనం జరుపుకునే అతి పెద్ద పండుగల్లో దేవీ నవరాత్రి ఒకటి. దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఒక్కోరోజుకు ఒక్కో రంగుకు ప్రాధాన్యత ఉంటుంది. ఏ రోజున ఏ రంగు దుస్తులు ధరించాలనేది తెలుసుకుందాం. నవరాత్రి తొలి రోజున తెలుపురంగు ధరించాల్సి ఉంటుంది. తెలుపు రంగు అనేది శాంతి, స్వచ్ఛత, సరళతకు ప్రతీక. మనస్సును ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంచుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది. రెండో రోజు ఎరుపు రంగును ధరించాలి. ఇది శక్తి, ఆధ్యాత్మికత, ఉత్సాహానికి ప్రతీక.

మూడవ రోజు రాయల్ బ్లూ కలర్ దుస్తులను ధరించాలి. ఇది శాంతి, గంభీరత, శ్రేయస్సుకు సంకేతం. నాలుగవ రోజు పసుపు రంగును ధరించాల్సి ఉంటుంది. ఇది ఆనందం, సంతోషం, ఆశకు సంకేతం. ఐదవ రోజు ఆకుపచ్చ రంగును ధరించాల్సి ఉంటుంది. ఇది ప్రకృతి, శ్రేయస్సు సమత్యులకు చిహ్నంగా చెబుతారు. ఆరవ రోజు బూడిద రంగును ధరించాల్సి ఉంటుంది. దీనిని సరళత, సమతుల్యతకు చిహ్నంగా పరిగణిస్తారు. ఏడవ రోజున నారింజ రంగు దుస్తులను ధరించాలి. ఇది ఉత్సాహం, అభిరుచి, సానుకూల శక్తికి సంకేతం. ఎనిమిదవ రోజు పీకాక్ గ్రీన్ ధరించాలి. ఇది జీవితంలో ఆనందం, సానుకూలతకు చిహ్నం. తొమ్మిదవ రోజున గులాబీ రంగు దుస్తులను ధరించాలి. ఇది ప్రేమ, దయ, కరుణకు సంకేతం.

Share this post with your friends
Exit mobile version