Site icon Bhakthi TV

అసలు శివుడు ఎందుకు బ్రహ్మ తలను నరికాడు?

బద్రీనాథ్ దగ్గర ఉన్న ‘బ్రహ్మ కపాల’ అనే ప్రదేశం గురించి తెలుసుకున్నాం కదా. అసలు శివుడు బ్రహ్మదేవుడిని ఎప్పుడు హత్య చేశాడు అంటారా? పురాణాల ప్రకారం.. శివుడికి, బ్రహ్మదేవుడికి మధ్య ఆధిపత్య పోరు జరిగిందట. వీరిద్దరి మధ్య వివాదం తారా స్థాయికి చేరడంతో శివుడికి పట్టరాని కోపం వచ్చిందట.. దీంతో బ్రహ్మ ఐదు తలల్లోని ఒకదానిని నరికేశాడు. దీంతో శివుడికి బ్రహ్మ హత్యా పాతకం అంటుకోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడట. బ్రహ్మ దేవుడి తన నరికినప్పుడు తలలోని కపాల భాగం శివుడి చేతికి అంటుకుందట.

ఈ పాపం నుంచి బయటపడేందుకు శివుడు చాలా స్థలాలను సందర్శించాడట. అయినా శివుడి చేతిని కపాలం వదల్లేదు. చివరిగా బద్రీనాథ్ క్షేత్రానికి చేరుకున్నప్పుడు శివుడి చేతిలోని కపాలం దానంతట అదే పడిపోయిందట. కాబట్టి శివుడికి విముక్తిని ప్రసాదించిన ప్రదేశంగా బద్రీనాథ్‌ను చెబుతారు. తమ పూర్వీకులకు మోక్షం ఇవ్వడం కోసం ఎక్కడెక్కడి నుంచో బయటకు వస్తారు. ఇక్కడ చేసే ప్రతి శ్రార్థ కర్మ కారణంగా ఆయా పెద్దలకు విముక్తి కలుగుతుంది. చేసిన వారికి పితృ దోషానికి సంబంధించిన సమస్యలన్నీ పోయి ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version