Site icon Bhakthi TV

శ్రీకృష్ణుడి మాతృమూర్తిగా చెప్పే రోహిణి ఎవరంటే..

యశోద: కన్నయ్యను కనకపోయినా కంటికి రెప్పలా చూసుకుంది యశోద. నందుడు-యశోద దంపతులు. వీరితో కలిసి శ్రీ కృష్ణుడు గోకులంలో పెరిగాడు. మట్టి తింటున్నాడని మందలించిన యశోదకు తన నోట్లో సకల సృష్టిని చూపించి ఆమెను ఆశ్చర్యచకితురాలిని చేస్తాడు చిన్ని కృష్ణుడు. భాగవత ప్రకారం యశోదకు కలిగిన అదృష్టం, ముక్తి ఆ బ్రహ్మ, మహేశ్వరులకు కూడా కలగలేదని చెబుతారు. చిన్నతనంలో బాలకృష్ణుడి అల్లరికి అతడిని మందలిస్తూనే.. ఎంతో ప్రేమగా చూసుకున్న యశోద కృష్ణుడి జీవితంపై ఎంతో ప్రభావితం చేసింది.

రోహిణి: వసుదేవుడు దేవకి కంటే ముందు రోహణిని వివాహం చేసుకున్నాడు. బలరాముడు, సుభద్ర, ఏకాంగ దేవి వీరి సంతానం. దేవకి-వసుదేవుల ఏడవ సంతానాన్ని రోహణి గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా ఆమెకు బలరాముడు జన్మిస్తాడు. రోహిణి తన కుమార్తె, కుమారుడితో కలిసి యశోద దగ్గర నివసిస్తారు. శ్రీ కృష్ణుడి ముత్తాత మారిషుడు, ఆయన సవతి తల్లి అయిన రోహిణి నాగ జాతికి చెందిన వారని చెబుతారు. అంతేకాకుండా హస్తినాపురానికి రాజు అయిన శాంతనవుడు సోదరుడు బాహిలిక కుమార్తే అని కూడా అంటారు.

Share this post with your friends
Exit mobile version