Site icon Bhakthi TV

బతుకమ్మలో వాడే గునుగు పువ్వు వలన ఎన్ని ప్రయోజనాలంటే..

తెలంగాణ ఆడపడుచులంతా బతుకమ్మ పండుగ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అలాంటి పండుగ రానే వచ్చింది. నిన్న (ఆదివారం) పెత్తరామాస మాత్రమే కాకుండా ఎంగిలిపూల బతుకమ్మను అత్యంత వైభవంగా మహిళలు నిర్వహించుకున్నారు. ఈ బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 29న సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. తెలంగాణ ప్రజలకు ఎంతో ఇష్టమైన ఈ పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది పువ్వులే కదా.. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేరుస్తారు. తంగేడు, గునుగు, సీతమ్మవారి పువ్వులు లేకుండా బతుకమ్మను అయితే పేర్చడం జరగదు.

ఇక వీటిలో అత్యంత ముఖ్యమైన గునుగు పువ్వు. ఈ పువ్వు బతుకమ్మకు మరింత అందాన్నిస్తుంది. గునుగు పువ్వులో ఎన్నో ఔషధ గుణాలుండటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి గాయాలున్న చోట పూస్తే ఎంత పెద్ద గాయమైనా మానిపోతుందని చెబుతారు. ముఖ్యంగా కందిరీగలు కుట్టినప్పుడు ఈ ఆకు రసం రాస్తే మంట త్వరగా తగ్గిపోవడంతో పాటు గాయం కూడా మాయమవుతుందట. క్షయ వ్యాధి నివారణకు సైతం గునుగు ఆకుల రసంతో తగ్గిస్తారట. గునుగు పువ్వుల గింజలు యూరినరీ ఇన్ఫెక్షన్‌ను తగ్గించడమే కాకుండా రక్తస్రావం, అతిసారం వంటి సమస్యలు తగ్గుతాయట.

Share this post with your friends
Exit mobile version