Site icon Bhakthi TV

అలా దేవతలందరికీ శాపవిమోచనగావించిన గాయత్రీదేవి

గాయత్రీదేవితో బ్రహ్మకు వివాహం జరిపించిన వారందరినీ సావిత్రీదేవి వరుసబెట్టి శపించింది. ఆ తరువాత రత్నగిరి కొండపైకి వెళ్లి తపస్సు చేసి సరస్వతీ నదిగా మారిపోయిన విషయం తెలిసిందే. సావిత్రీ దేవి నదిగా మారిందనడానికి సాక్ష్యం కూడా ఉంది. దీనికి చిహ్నంగా రత్నగిరి కొండమీద సావిత్రీమాత ఆలయంతో పాటు ఓ చిన్న నీటి ప్రవాహం కూడా ఉంది. సరస్వతి నది ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెబుతారు. పుష్కర్‌ను సందర్శించిన భక్తులంతా తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా సందర్శించుకుంటారు. ఈ సావిత్రి దేవిని దర్శించుకున్న మహిళలకు అమ్మవారు నిత్యసుమంగళి వరాన్ని ప్రసాదిస్తుందట.

ఆగ్రహంతో సావిత్రీదేవి అందరినీ శపించి అక్కడి నుంచి వెళ్లిపోయిందని చెప్పుకున్నాం కదా. ఆ తరవాత బ్రహ్మదేవుడు మధ్యలో నిలిపివేసిన యజ్ఞాన్ని పూర్తి చేయాలని భావిస్తాడు. ఈ క్రమంలోనే ఆ విషయాన్ని బ్రాహ్మణులకు చెబుతాడు. అప్పుడు వారంతా ముందు తమకు శాపవిముక్తి చేయమని.. ఆ తరవాతే యజ్ఞక్రతువు పూర్తి చేస్తామని చెప్పారు. ఆ తరువాత గాయత్రీదేవి తనకు యజ్ఞ ఫలంతో సిద్ధించిన శక్తులతో పుష్కర్ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతుందనీ, ఇంద్రుడు తిరిగి స్వర్గాన్ని గెలుచుకుంటాడని, శ్రీరాముని అవతారంలో విష్ణుమూర్తి భార్య వియోగాన్ని అనుభవిస్తాడని శాప విమోచనం గురించి చెబుతుంది. అనంతరం బ్రాహ్మణులకు కూడా శాప తీవ్రతను తగ్గించిందట.

Share this post with your friends
Exit mobile version