Site icon Bhakthi TV

ఇక్కడ శివుడు బ్రహ్మ హత్యా పాపం నుంచి విముక్తి పొందాడట..

హిందూమతంలో చార్‌దామ్ యాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ యాత్రలో భాగంగా నాలుగు థామ్‌లను భక్తులు సందర్శించుకుంటారు. ప్రతి హిందువుకి జీవితంలో ఒక్కసారైనా చార్ ధామ్ యాత్ర చేయాలనే కోరిక ఉంటుంది. ఈ క్రమంలోనే ఏటా లక్షలాది మంది భక్తులు ఈ యాత్ర చేస్తూ ఉంటారు. ఈ నాలుగు ధామ్‌లలో ఒకటి బద్రీనాథ్. ఇక్కడ ‘బ్రహ్మ కపాల’ అనే ప్రదేశం ఉంది. శివుడు బ్రహ్మ హత్యా పాపం నుంచి ఇక్కడే విముక్తి పొందాడని చెబుతారు. అసలు ఈ ప్రదేశం ప్రాముఖ్యత ఏంటి? పౌరాణిక ప్రాశస్త్యం ఏంటో తెలుసుకుందాం.

ఇక్కడకు వచ్చిన భక్తులంతా బ్రహ్మ కపాలంలో పూర్వీకుల శ్రార్ధ కర్మలను నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ కానీ పూర్వీకులకు పిండ ప్రదానం చేస్తే వారు మరణ చక్రం నుంచి శాశ్వత విముక్తి పొందుతారట. తద్వారా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుందట. బ్రహ్మ స్వయంగా ఈ ప్రదేశంలో ఉన్నాడని అక్కడి వారంతా చెబుతారు. అంతేకాకుండా భక్తులు తమ పూర్వీకుల కోసం చేసే శ్రార్థ కర్మలను బ్రహ్మ స్వయంగా అంగీకరిస్తారని ప్రతీతి. తద్వారా పితృ దోషమంతా తొలగిపోయి ఆ కుటుంబం సుఖ సంతోషాలతో జీవిస్తుందని చెబుతారు.

Share this post with your friends
Exit mobile version