
మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. వెయ్యేళ్లకు పైగా పురాతనమైన ఆలయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మానవ మేథస్సుకి అందని రహస్యాలను దాచుకున్నాయి. అలాంటి వాటిలో ఒకటి రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు సమీపంలో ఉంది. ఈ ఆలయం దుర్గాదేవి అవతారమైన ఇడాన మాత దేవాలయం. ఈ ఆలయం వెయ్యేళ్లకు పూర్వం నాటినదని చెబుతారు. అమ్మవారు దుష్ట శిక్షణ కోసం స్వయంభువుగా వెలిసిందని చెబుతారు. ఈ ఆలయంలో ఎవరి ఊహకూ అందనిది ఒకటి జరుగుతుంది. అదేంటంటే.. అమ్మవారు అగ్ని స్నానం చేస్తుంది.
ఈ అద్భుతంతోనే భారతదేశంలోని శక్తి పీఠాలలో ప్రత్యేకమైదిగానూ.. సైన్స్‌కే పెను సవాల్‌గానూ ఈ ఆలయం నిలిచింది. దేవత అగ్ని స్నానం చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా దర్శించుకున్నవారందరి దుఃఖాలు తొలగి.. అనారోగ్యాల నుంచి ఉపశమనం పొందుతారట. ఈ ఆలయం ఉదయపూర్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరావళి కొండలలో ఉంది. మేవార్ శక్తి పీఠంగా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు. ఈ ఆలయానికి పైకప్పు అనేది ఉండదు. ఇక్కడ అమ్మవారు స్వయంగా అగ్నిలో స్నానం చేస్తూ ఉంఉంది. అసలు ఎప్పుడు మంటలు చెలరేగుతాయో కూడా తెలియదట. అకస్మాత్తుగా 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకూ మంటలు ఎగిసి పడతాయట.
