Site icon Bhakthi TV

ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడనుంది?

ఈ ఏడాది నాలుగు గ్రహణాలు సంభవించనున్నాయి. వాటిలో రెండు గ్రహణాలు ఇప్పటికే సంభవించిన విషయం తెలిసిందే. వాటిలో ఒకటి చంద్రగ్రహణం కాగా.. మరొకటి సూర్యగ్రహణం. ఇవి రెండూ గత నెలలోనే సంభవించాయి. అయితే ఈ రెండు గ్రహణాలు భారతదేశంలో కనిపించలేదు. ఇక ఈ ఏడాది మరో రెండు గ్రహణాలే సంభవించనున్నాయి. మరి అవైనా ఈ ఏడాది కనిపిస్తాయో లేదనేది ఆసక్తికరంగా మారింది. అసలు ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందో ముందుగా తెలుసుకుందాం.

ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ 21న అమావాస్య రోజున ఏర్పడనుంది. ఈ గ్రహణం సెప్టెంబర్ 21న రాత్రి 11 గంటలకు ఏర్పడుతుంది. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 22న తెల్లవారుజామున 3:24 గంటల వరకు ఉంటుంది. మొత్తంగా ఈ సూర్యగ్రహణం మొత్తం 4 గంటల 24 నిమిషాల పాటు ఉంటుంది. అయితే ఈ సూర్య గ్రహణం కూడా భారత్‌లో కనిపించే అవకాశం లేదు. ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపించనుంది. కాబట్టి భారతీయులకు సూతకాలం అంటూ ఏమీ ఉండదు.

Share this post with your friends
Exit mobile version