Site icon Bhakthi TV

శ్రీవారి ఆలయంలోని మండపాల మహిమ ఏంటంటే..

శేషాచల కొండపై వెలసిన శ్రీవారి ఆలయం 12వ శతాబ్దంలో నిర్మితమైంది. 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో అద్భుతంగా వెలసింది. మూడు ప్రాకారాలు, శాసనాలు, ఆభరణాలు, పవిత్ర వస్త్రాలు, నైవేద్య వంటగదులు, లడ్డూ ప్రసాద పోటు – ఇవన్నీ ఆధ్యాత్మిక కాంతిని ప్రసరింపజేస్తాయి. అనేక రాజులు, రాణులు, సేనాధిపతులు, భక్తులు విరాళాల ద్వారా ఆలయాభివృద్ధికి సహకరించారు. ఆలయంలోని మండపాల మహత్స్యం ఏంటో తెలుసుకుందాం.

మహాద్వారం – 13వ శతాబ్దపు గోపురం, అనంతాళ్వారుల గునపం ఇక్కడే కట్టబడి ఉంటుంది.

కృష్ణరాయ మండపం – 16 స్థంభాలు, రాగి–రాతి విగ్రహాలతో రాజవంశాల చరిత్రను చెబుతుంది.

రంగనాయక మండపం – 1310–1320లో నిర్మితమై, ఉత్సవమూర్తులను కాపాడిన పవిత్ర స్థలం.

తిరుమలరాయ మండపం (ఊంజల్ మండపం) – శిల్పకళా వైభవం; బ్రహ్మోత్సవ ధ్వజారోహణం ఇక్కడే జరుగుతుంది.

అద్దాల మండపం (ఆఐనా మహల్) – 36 స్థంభాలతో అద్భుత నిర్మాణం, ప్రతిరోజూ డోలోత్సవం జరుగు ప్రదేశం.

ధ్వజస్తంభ మండపం – 1470లో నిర్మితమై, బంగారు ధ్వజస్తంభం, బలిపీఠం కలిగిన పుణ్యస్థానం.

వసంత మండపం – మహాప్రదక్షిణలో నైరుతి మూలలో ప్రత్యేకంగా వెలసినది.

కళ్యాణ మండపం – 1586లో నిర్మితమై, స్వామివారి కల్యాణోత్సవానికి వేదిక.

Share this post with your friends
Exit mobile version