Site icon Bhakthi TV

Suvarna Gita : ఉడిపి శ్రీకృష్ణుడికి బంగారు భగవద్గీత… జనవరి 8న బహుకరణ

ఉడిపి శ్రీకృష్ణుడికి బంగారు భగవద్గీత జనవరి 8న బహుకరణ..! #lordkrishna #arjuna #bagavatgita #shorts

శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన భగవద్గీతలోని ప్రతి శ్లోకం లోకానికి వెలుగునిచ్చే దివ్య జ్ఞానం. ఆ అమృత వాణిని మరింత మహిమాన్వితంగా నిలిపేలా, ఢిల్లీకి చెందిన ఓ మహాభక్తుడు సుమారు 2 కోట్ల విలువైన బంగారు పేపర్లతో స్వర్ణ భగవద్గీతను రూపొందించి, కర్ణాటకలోని ప్రసిద్ధ ఉడుపి శ్రీకృష్ణ మఠానికి సమర్పించబోతున్నారు. 18 అధ్యాయాలు, 700 శ్లోకాలతో అలంకరించబడిన ఈ అపురూప గ్రంథాన్ని జనవరి 8న విశ్వగీతా పర్యాయ ముగింపు సందర్భంగా మఠాధిపతి విద్యాధీశతీర్థ స్వామివారికి బంగారు రథంలో ఊరేగింపుగా తీసుకువచ్చి సమర్పించనున్నారు. జగద్గురు శ్రీ మధ్వాచార్యులు స్థాపించిన ఈ పవిత్ర ఆలయంలో స్వర్ణ భగవద్గీత ఆవిష్కరణ ఒక ఆధ్యాత్మిక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. ఇది ఐశ్వర్య ప్రదర్శన కాదు… శ్రీకృష్ణుడి బోధనలపై భక్తి, కృతజ్ఞతకు అర్పణగా భక్తులు భావిస్తున్నారు.

Suvarna Gita
Share this post with your friends
Exit mobile version