Site icon Bhakthi TV

ముత్యపు పందిరి వాహనంపై శ్రీ వేణుగోపాలస్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం సైతం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే ఏర్పాట్లు చేయడంతో భక్తులు సైతం ఆనందంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి వేణుగోపాలస్వామి స్వామి అలంకారంలో స్వామివారు సింహ వాహనంపై భక్తులను అనుగ్రహించారు.

రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం 5 గం.లకు ఊంజల్ మండపంలోకి శ్రీవారు వేంచేపు చేశారు. అనంతరం సా. 5.30 – 6.30 గం.ల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. ఇవాళ ఉదయం 8 గం.లకు కల్పవృక్ష వాహనంపై స్వామి వారు భక్తులను ఆశీర్వదించనున్నారు. వాహన సేవలో డిప్యూటీ ఈవో శ్రీ హరీంధ్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శివకుమార్, అర్చకులు, శ్రీవారి సేవకులు,భక్తులు పాల్గొన్నారు.

Share this post with your friends
Exit mobile version