Site icon Bhakthi TV

చిన్న శేష వాహనంపై ఊరేగిన కీలపట్ల శ్రీ కోనేటిరాయ స్వామి వారు

చిత్తూరు జిల్లా కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా అత్యంత వైభవంగా ప్ర‌తిరోజూ రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి వాహన సేవల్లో పాల్గొంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు సోమ‌వారం ధ్వ‌జారోహ‌ణంతో వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. సోమవారం సాయంత్రం పెద్ద శేష వాహనంపై ఊరేగిన కోనేటి రాయుడు.. మంగళవారం చిన్న శేష వాహనంపై ఊరేగారు.

ఉత్సవాల్లో భాగంగా శ్రీ కోనేటి రాయుడి కల్యాణోత్సవాన్నిసైతం నిర్వహించనున్నారు. మే 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక‌, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Share this post with your friends
Exit mobile version