Site icon Bhakthi TV

ఘ‌నంగా ముగిసిన శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు

తిరుపతి రామచంద్ర పుష్కరిణిలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీకోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 8 నుండి 10 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగానిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్ళు, ప‌సుపు, చందనంతో స్వామి, అమ్మవార్లఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వ‌హించారు.

 

ఘ‌నంగా ముగిసిన శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు

 

అనంతరం సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు సాయంత్రం 6 గంటలకు ఆలయం నుండి బయల్దేరి రాత్రి 7 గంటలకు శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. విద్యుద్దీపాలు, పుష్పాలతోఅందంగా అలంకరించిన తెప్పపై స్వామి, అమ్మవారు ఆశీనులై పుష్కరిణిలో తొమ్మిది చుట్లు తిరిగిభక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. తెప్పోత్సవం అనంతరం స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.

Share this post with your friends
Exit mobile version