Site icon Bhakthi TV

అత్యంత వైభవంగా ప్రారంభమైన సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ

విశాఖ సింహాచలం అప్పన్నస్వామి గిరి ప్రదక్షిణ భక్త జన సందోహం నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే పెద్ద ఎత్తున భక్తులు చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అప్పన్న నామ స్మరణతో సింహాచలం మారుమోగుతోంది.

సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ మొత్తంగా 32 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఈ గిరి ప్రదక్షిణ తొలిపావంచా దగ్గర ప్రారంభమవుతుంది. అనంతరం అడవివరం, ముడుసర్లోవ, హనుమంతువాక, వెంకోజిపాలెం కూడలి, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడీ జంక్షన్‌, గోపాలపట్నం, పాతగోశాల మీదుగా కొనసాగుతుంది. చివరకు సింహాచలం అప్పన్న ఆలయం వద్ద ముగుస్తుంది. ఈ గిరి ప్రదక్షిణ తెల్లవారుజామునే మొదలవుతుంది. రేపు తెల్లవారుజాము వరకూ కొనసాగుతుంది. ఇక సింహాద్రి అప్పన్న స్వామివారి తుది విడత చందనోత్సవాన్ని సైతం గిరి ప్రదక్షిణ ముగిసిన తర్వాత ఆషాడ పౌర్ణమి సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

Share this post with your friends
Exit mobile version