
శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతి రోజూ వాహన సేవలు ఉదయం 8 – 9 గం.ల మధ్య, రాత్రి 7 – 8 గంటల మధ్య జరుగనున్నాయి. 23వ తేదీన సాయంత్రం 4 – 5 గంటల మధ్య స్వర్ణ రథం, 25వ తేదీన ఉదయం 8.40 – 9.40 గంటల మధ్యన రథోత్సవం, 26వ తేదీన ఉదయం 10 – 10.20 గం.ల మధ్య చక్రస్నానం జరుగనుంది.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
18-02-2025
ఉదయం – ధ్వజారోహణం (మీనలగ్నం)
రాత్రి – పెద్దశేష వాహనం
19-02-2025
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం
20-02-2025
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం
21-02-2025
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం
22-02-2025
ఉదయం – పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)
రాత్రి – గరుడ వాహనం
23-02-2025
ఉదయం – హనుమంత వాహనం
సాయంత్రం – స్వర్ణరథం,
రాత్రి – గజ వాహనం
24-02-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం
25-02-2025
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం
26-02-2025
ఉదయం – చక్రస్నానం
రాత్రి – ధ్వజావరోహణం
