
శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో నిన్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో మే 22వ తేదీ సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
19-05-2025
ఉదయం – ధ్వజారోహణం
సాయంత్రం – పెద్దశేష వాహనం
20-05-2025
ఉదయం – చిన్నశేష వాహనం
సాయంత్రం – హంస వాహనం
21-05-2025
ఉదయం – సింహ వాహనం
సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం
22-05-2025
ఉదయం – కల్పవృక్ష వాహన
సాయంత్రం – ఆర్జితకళ్యాణోత్సవం/ సర్వభూపాల వాహనం
23-05-2025
ఉదయం – మోహినీ అవతారం
సాయంత్రం – గరుడ వాహనం
24-05-2025
ఉదయం – హనుమంత వాహనం
సాయంత్రం – గజ వాహనం
25-05-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
సాయంత్రం – చంద్రప్రభ వాహనం
26-05-2025
ఉదయం – రథోత్సవం
సాయంత్రం – అశ్వవాహనం
27-05-2025
ఉదయం – చక్రస్నానం
సాయంత్రం – ధ్వజావరోహణం
