Site icon Bhakthi TV

ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళం

తిరుమలలోని పలు విభాగాలకు దాతలు దాదాపుగా నిత్యం ఏదో ఒక విరాళాన్ని అందజేస్తూనే ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా శ్రీ వేంకటేశ్వర స్వామివారికి చాలా కాలం తరువాత అఖండాలు విరాళంగా అందిన విషయం తెలిసిందే. దాదాపు 300 ఏళ్ల తరువాత ఈ అఖండాలను శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదా దేవి అందించారు. ఒక్కో అఖండం 50 కిలోల బరువు ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్‌కు పెద్ద మొత్తంలో విరాళాన్ని అందజేసింది.

హైదరాబాద్‌కు చెందిన ప‌వ‌ర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ శ్రీ సత్య రోహిత్ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్ర‌వారం రూ.17 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ విరాళాన్ని భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ఒక పూట మధ్యాహ్నం భోజనం వడ్డించేందుకు ఉపయోగించాలని దాత కోరారు.

Share this post with your friends
Exit mobile version