
హిందూ ధర్మంలో ఓంకార శబ్దానికి చాలా ప్రాధాన్యత ఉంది. ధ్యానంలోనూ.. యోగా సెషన్స్‌లోనూ.. ఓంకారాన్ని పటిస్తూ ఉంటారు. దీని వలన శారీరక, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతుంది. ఏకాగ్రతను పెంచడంతో పాటు దైవంతో సంబంధాన్ని పెంపొందిస్తుంది. రోజూ 30 సార్లు ఓంకారాన్ని పటిస్తే అద్భుతమైన లాభాలుంటాయి. ఓం అనేది త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో ముడిపడి ఉంటుంది. ఓంకార శబ్దానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందనేది ఓ బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది. కోల్‌కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ అనే బాలిక ఓం అనే శబ్దం వింటే ఏం జరుగుతుందో తెలియజేసింది. దీనికోసం ఆ బాలిక కొందరిని ఎంచుకుని వారికి ప్రశాంత వాతావరణంలో ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించిన తర్వాత శరీరంలోని ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని లెక్కించింది.
ఆశ్చర్యకరంగా శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగి, కార్బన్ డయాక్సైడ్ శాతం తగ్గిపోయింది. అలాగే రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్‌డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గిపోయాయ. తద్వారా అలసట దూరం అవుతుందని నిరూపించింది. ఓం శబ్దం శక్తిని తెలుసుకోవాలన్న ఆలోచన సదరు బాలికి చార్‌ధామ్ యాత్ర సమయంలో వచ్చిందట. కొందరు పూజారులు నిత్యం నీటిని అన్వేష బగేశ్వర్ నుంచి 68 కి.మీ. దూరంలో ఉన్న కేదారీనాథ్‌కు తీసుకెళుతున్నారని.. వారిలో ఎలాంటి అలసట కానీ ఆయాసం కానీ కనిపించలేదట. వారు ఓం కారం జపిస్తూ తీసుకెళుతుండటంతోనే అలా జరిగి ఉంటుందని భావించింది. ఈ విషయాన్నీ నిర్ధారించుకోవడానికి వివిధ ల్యాబొరేటరీల్లో ఐదు ప్రయోగాలను నిర్వహించింది. తద్వారా ఓంకారాన్ని అరగంట సేపు జపిస్తే మనస్సు, శరీరం ఆత్మ ప్రభావితమై ఒత్తిడిని తగ్గించి విశ్రాంతిని ప్రేరేపిస్తుందట.
