Site icon Bhakthi TV

మే 11 నుంచి రిషికేష్‌ శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఉత్తరాఖండ్ రాష్ట్రం, డెహ్రాడూన్ జిల్లా, రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 11 నుంచి 19వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా మే 6వ తేదీన కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. మే 10వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మే 18వ తేదీ స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రోజు ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

తేదీ

11-05-2025

ఉదయం – ధ్వజారోహణం (ఉద‌యం 10.50 నుండి 11.15 గంట‌ల వ‌ర‌కు)

సాయంత్రం – పెద్దశేషవాహనం

12-05-2025

ఉదయం – చిన్నశేషవాహనం

సాయంత్రం – హంసవాహనం

13-05-2025)

ఉదయం – సింహవాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

14-05-2025

ఉదయం – కల్పవృక్షవాహనం

సాయంత్రం – సర్వభూపాలవాహనం

15-05-2025

ఉదయం – పల్లకీ ఉత్సవం

సాయంత్రం – గరుడవాహనం

16-05-2025

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – గజవాహనం

17-05-2025

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

18-05-2025

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – శ్రీవారి కల్యాణోత్సవం, అశ్వవాహనం

19-05-2025

ఉదయం – చక్రస్నానం (ఉద‌యం 9 నుండి 9.45 గంట‌ల వ‌ర‌కు)

సాయంత్రం – ధ్వజావరోహణం

Share this post with your friends
Exit mobile version