Site icon Bhakthi TV

Panch kedar Kalpeshwar Temple : పంచ కేదారాల్లో ఐదవది కల్పేశ్వర్.. అదెక్కడుంటే..

పంచ కేదారాల్లో ఐదవది కల్పేశ్వర్  అదెక్కడుంటే..! #uttarakhand #panchakedharals #kalpeswar #kedharnath

ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతంలో వెలసిన పవిత్ర శైవ క్షేత్రాలు పంచ కేదారాలుగా విరాజిల్లుతున్నాయి. పంచ కేదారాల దర్శనంతో మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇప్పటికే పాండవులు ప్రతిష్టించిన పంచ కేదారాల్లో నాలుగు కేదారాల గురించి తెలుసుకుందాం. ఈ క్రమంలోనే పంచ కేదారాల్లో చివరిదైన కల్పేశ్వర్ గురించి తెలుసుకుందాం. మరి కల్పేశ్వర్ ఎక్కడుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? తెలుసుకుందాం. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ ప్రాంతమైన చమోలిలోని హెలాంగ్ గ్రామం నుంచి దాదాపు 30 కి.మీ కల్పేశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు.

Panch kedar Kalpeshwar Temple

ఈ ఆలయం చాలా ఆసక్తికరంగా ఒక గుహ లాగా ఉంటుంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి దాదాపు 2200 మీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి దీనికి వెళ్లాలంటే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లాల్సిందే. కల్పేశ్వర్ చేరుకోవాలంటే ముందుగా ఉగ్రమ్ లోయ మీదుగా 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయానికి వెళ్లాలంటే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ బేస్ పాయింట్‌కు చేరుకుని వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి దాదాపు 243 కి.మీ. ప్రయాణిస్తే కానీ హోలాంగ్ గ్రామానికి చేరుకోలేం. ఆ అక్కడికి బస్సు లేదంటే కారులో వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలలో కొంత దూరం ప్రయాణిస్తే ఉర్గం లోయకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉర్గం నుంచి 2 కి.మీ దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version