Site icon Bhakthi TV

Kumararamam temple History : సామర్లకోటలోని కుమారరామం ఆలయ విశిష్టతలేంటంటే..

సామర్లకోటలో శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్టించాడని చెబుతారు. అందుకే దీనికి కుమారారామంగా పేరు వచ్చింది. చాళుక్య భీముడు నిర్మించడం వల్ల ఇక్కడి స్వామివారు కుమార భీమేశ్వరుడుగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయ నిర్మాణం చాలా చక్కని శిల్ప కళా వైభవాన్ని కలిగి ఉంది. 1340-1466 మధ్య కాలంలో ఈ ఆలయ పునర్నిర్మాణం జరిగింది. కాకతీయులు కూడా ఈ మందిరాన్ని కొంత మేర పునర్నిర్మించారు. అందువల్లనే ఈ ఆలయంలో తూర్పు చాళుక్యుల నాటి శిల్పకళతో పాటు కాకతీయుల నాటి శిల్ప కళను కూడా మనకు కనిపిస్తుంది. ఆలయ విశిష్టతల గురించి తెలుసుకుందాం.

సామర్లకోటలోని కుమారరామం ఆలయ విశిష్టతలేంటంటే..

శివలింగం ప్రత్యేకతలు ఏంటంటే.. ఇక్కడి శివలింగం సున్నపు రాయితో నిర్మితమైంది. కాబట్టి ఈ ఆలయం తెల్లని రంగులో.. దాదాపు 14 అడుగుల ఎత్తు కలిగి, రెండంతస్తుల మండపం వరకూ విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. శివలింగం అంతకంతకూ పెరిగిపోతోంది. అందుకే శివలింగంపై పైభాగాన శిల్పులు చీల కొట్టారనే కథ స్థానికంగా ప్రచారంలో ఉంది. ఈ ఆలయం రెండు అంతస్తుల్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా. భక్తులు మొదట మొదటి అంతస్తులో లింగ దర్శనం చేసుకుని, ఆపై కింది అంతస్తులో లింగ పాద భాగాన్ని దర్శించుకుంటారు.

Share this post with your friends
Exit mobile version