Site icon Bhakthi TV

Interesting Facts About Nageshwar Jyotirlinga : నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే ఏం జరుగుతుందంటే..

దారుకావనంలోని రాక్షసులందరినీ పార్వతీదేవి శివ భక్తులుగా మార్చేసింది. దారుక దంపతులను రాక్షస ప్రవృత్తిని వీడి.. శివలింగాన్ని అదృశ్య రూపంలో కలియుగాంతం వరకూ కాపాడాలని పార్వతీదేవి చెప్పిందట. ఇప్పటికీ దారుక దంపతులు అదృశ్య రూపంలో నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని కాచుకుని ఉన్నారట. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం అనేది చాలా గొప్పదిగా చెబుతారు. ద్వాదశ జ్యోతిర్లింగాలన్నింటిలో కెల్లా ఇది శ్రేష్టమైనదిగా చెబుతారు. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే వ్యాపారంలో నష్టపోయిన వారు తిరిగి నిలదొక్కుకుంటారట. అంతేకాకుండా వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుందట.

Interesting Facts About Nageshwar Jyotirlinga

కలి దోషం ఉన్నవారు సైతం ఈ నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే అదంతా తొలగిపోతుందని చెబుతారు. అంతేకాకుండా ఈ ఆలయంలో జ్యోతిర్లింగంగా ఉన్న పరమేశ్వరుడిని ప్రత్యేకంగా కాకుండా అమ్మవారితో కలిపి అర్చన చేయడం వలన సకల శుభాలు పొందుతారని నమ్మకం. అలాగని సాక్షాత్తు పరమేశ్వరుడే వరమిచ్చాడట. ఈ విషయాన్ని శివపురాణం చెబుతోంది. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకా క్షేత్రాన్ని దేవభూమిగా పేర్కొంటారు. ఈ దేవభూమికి 12 కిలోమీటర్ల దూరంలో నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది. ఈ క్షేత్రానికి వెళ్లాలంటే రైలు, బస్సు, విమాన సౌకర్యాలున్నాయి. ఇక ఆలయం వచ్చేసి ఉదయం 6:00 నుంచి రాత్రి 9:00 గంటల వరకూ తెరిచి ఉంటుంది.

Share this post with your friends
Exit mobile version